Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Radha Movie Review

May 12, 2017
Sri Venkateswara Cine Chitra
Sharwanand, Lavanya Tripathi, Kota Srinivasa Rao, Ali, Brahmaji, Pragathi, Sathagiri, Shakalaka Shankar, Ashish Vidyarthi, Tanikella Bharani, Ravi Kishan
Ghattamaneni Karthik
Kotagiri Venkateswara Rao
BVSN Prasad
Radhan
Bogavalli Bapineedu
Chandra Mohan

శర్వానంద్ 'రాధ' (రివ్యూ)

ఏం మిగతా హీరోలేనా..నేను మాత్రం రొటీన్ కథలు చేయకూడదా..రొటీన్ సినిమాతో జనాలని విసిగించకూడదా, నా అభిమానులు మాత్రం ఏం పాపం చేసుకున్నారు, వాళ్లకు కూడా ఓ రొటీన్ సినిమా ఇస్తే పండగ చేసుకోరూ అనుకుని ఈ కథ ఒప్పుకున్నాడా శర్వానంద్ అని డౌట్ వస్తుంది. లేదా తను చేస్తున్న సీరియస్ పాత్రలు తనకు రొటీన్ అనిపించి, ఈ రొటీన్ సినిమాని విభిన్నంగా ఫీలై సినిమా చేసి ఉండవచ్చు. అదేమీ కాకపోతే ఆయన శ్రేయాభిలాషులు, సన్నిహితులు, లేకపోతే ఆయన అంతరాత్మ...ఎంతకాలం ఇలా సీరియస్ పాత్రలు చేస్తావు..మిగతా హీరోలు మాస్ సినిమాలు చేసి హిట్ల్ కొడుతున్నారు. మాస్ లో నే మహిమ ఉందని, నువ్వూ 1000 కోట్ల హీరోవి కావాలంటే మాస్ పల్స్ పట్టుకోవాల్సిందే...అని నూరిపోసి ఉండవచ్చు. వీటిల్లో ఏ కారణంతో శర్వానంద్ ఈ సినిమా చేసినా మనకు మాత్రం రాథ...వెంటనే మరిచిపోవాలనిపించే ఓ వెండితెర ఫెయిల్యూర్ గాథ. అదెలా జరిగింది,అసలు ఈ సినిమా కథేంటి, సినిమా అంతగా నచ్చకపోవటానికి కారణమేమిటి అనే విషయాలు తెలుసుకోవాలనిపిస్తే రివ్యూ చదవాల్సిందే.

కథేంటి...

పెద్దలకు కూడా పెద్దగా అర్దం కాని భగవద్గీతను చిన్నప్పుడే ఆకళింపు చేసుకున్న రాధకృష్ణ..(శర్వానంద్) తనను తాను కృష్ణుడులా ఫీలవుతూ పెరుగుతాడు. అంతేకాకుండా చిన్నప్పుడు ఓ సారి తను ప్రమాదంలో ఉన్నప్పుడు కృష్ణా అని పిలిస్తే ...పోలీస్ వచ్చి రక్షించాడని...పోలీసంటే మరెవరో కాదని..కృష్ణుడు అని నమ్మి,పెద్దయ్యాక కూడా ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేస్తూ..పెద్ద పోలీస్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు. అలాగే పోలీస్ ఉద్యోగం వచ్చేవరకూ ఖాళీగా ఉండటం ఎందుకు, కాస్త వర్క్ అన్నా అలవాటు అవుతుందన్నట్లుగా ...టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని క్రిమినల్స్ వెంటబడి భరతం పడుతూంటాడు. ముఖ్యంగా పోలీస్ లను ఎవరన్నా ఏమన్నా అంటే... వాళ్ల ప్రాణం తీస్తూంటాడు. అలా డిపార్టమెంట్ కు జీతం,భత్యం లేకుండా ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఫైట్స్ చేస్తూ...సాయిపడుతున్న రాధాని చూసి డిజీపీ...ముచ్చటపడి...ఎస్సైగా జాబ్ ఇప్పిస్తాడు. దాంతో కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా..ఒంటిమీదకు ఖాఖీ పడగానే దుష్ట శిక్ష‌ణ విష‌యంలో మ‌రింత‌గా చెల‌రేగిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.

అయితే అతని కోరికకకు రివర్స్ లో క్రైమ్ కు కొంచెం కూడా చోటు లేని ప్రాంతంలో తొలి పోస్టింగ్ ఇస్తారు. దాంతో తను క్రిమినల్స్ ని కుమ్మేద్దామనుకుంటే...ఒక్కరూ అక్కడ లేరే అని బాధపడుతూ,వేరే చోటకు ట్రాన్శఫర్ చేయమని అడుగుతాడు. సర్లే అతని ముచ్చట ఎందుకు కాదనటం అని హైదరాబాద్ ధూళ్ పేట ఏరియాకి ట్రాన్సఫర్ చేస్తారు. ఆ ధూళ్ పేట ఏరియా...క్రిమినల్స్ కు అడ్డా..క్రైమ్స్ కు ..కాణాచి. కావాలని మరీ క్రైమ్ ఏరియాకు వచ్చిన మన హీరో గారు ...అక్కడ క్రిమినల్స్ ని ఖైమా క్రింద చావ కొట్టేసాడా...అక్కడ అతనికి ఎలాంటి కేసులు తగిలాయి... సీఎం కావాల‌నుకొన్న హోం మినిస్ట‌ర్ సుజాత (ర‌వికిష‌న్‌) చేసిన క్రైమ్ ఏంటి...దాన్ని హీరో ఎలా పట్టుకుని బుద్ది చెప్పాడు...ఈ కథలో అసలు ఇమడని హీరోయిన్ రాధ(లావణ్య త్రిఫాఠి) ని ఎలా ఇరికించి లవ్ స్టోరీ నడిపాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ...

చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలి,పోలీసే దేవుడు అని డిపార్టమెంట్ లోకి వచ్చినవాడు...అదే పోలీస్ కు అన్యాయం జరిగితే ఎలా స్పందించాడు..ఏం చేసాడు అని రాసుకోగలిగిన చిన్న స్టోరీ లైన్ ను...కామెడీ పేరుతో ఖూన చేసేసారు. దాంతో అటు కామెడీకు ఇటు...పగ,ప్రతికారం మార్క్ కథకు మధ్య నిలబడి ప్రతీ క్షణం..అటు అడుగు వెయ్యాలా.ఇటు అడుగు వెయ్యాలా అని కన్ఫూజ్ అవుతూ క్లైమాక్స్ కు వెళ్లింది. అసలు పోలీస్ అవ్వాలనుకునే హీరో క్యారక్టరైజేషన్ కు ..కృష్ణుడుకు లింకేంటో అర్దం కాదు. పోనీ బలవతంగా ఏదో లింక్ కలిపినా, దాని వల్ల కథకు ఒరిగిందీ లేదు.

ఏదో చిన్నప్పుడు ...కృష్ణుడు అంటే ఇష్టంతో పోలీస్ అవ్వాలనకున్నాడు అంటే అర్దం ఉంది. పెద్దయ్యాక కూడా అదే కంటిన్యూ చేయటం ఏమిటో అర్దంకాదు.పోనీ అలాగే పెద్దైనా అవే ఆలోచనలు మిగిలిపోయిన క్యారక్టరైజేషన్ హీరోది అంటే..అలాంటి పిక్షన్ క్యారక్టర్ కు ... పోలీస్ లకు అన్యాయం జరగి, చనిపోవటం అనే రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న పాయింట్ ని మిక్స్ చేయటంలోనే స్క్రీన్ ప్లే నాన్ సింక్ లో నడిచింది. దాంతో రియలిస్టిక్ సమస్యను ...ఓ పిక్షన్ క్యారక్టర్ నడిపించాల్సి వచ్చి చాలా ఇబ్బంది పడిపోయింది. దాంతో సీరియల్ గా నడవాల్సిన కథ కాస్తా...నాన్నకు ప్రేమతో వంటి స్ఫూఫ్ తో నడిపించాల్సిన పరిస్దితి వచ్చింది.

పోనీ విలన్ ది ఏమన్నా కొత్త ట్విస్టా అంటే...సూపర్ హిట్ రంగం సినిమాలోది. సెకండాఫ్ కథనం అంతా రన్ రాజా రన్ ని గుర్తు చేసేలా నడిపాలనే వృధా ప్రయత్నం. ముఖ్యంగా పొలిటికల్ వెర్శస్ పోలీస్ కథలకు ఎమోషన్ డెప్త్ లేకపోతే వర్కవుట్ కాదు. కథలో కీలకమైన పోలీస్ లు మృతి అనే అంశం...క్యాజవల్ గా చూసేవారికి అనిపించి, ఏ అనుభూతి కలిగించనప్పుడు తర్వాత హీరో ఏం చేసినా ఫలితం లేదు.

ముఖ్యంగా...విలన్..వల్ల పోలీస్ లు చనిపోయారని చెప్తాడే కాని అక్కడ చనిపోయిన మిగతావాళ్ల గురించి హీరో మాట్లాడడు. అలా కాకుండా...నీ ఎదుగులకోసం వేసిన బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ వల్ల ..జనాలని, నీ సెక్యూరిటీ కోసం వచ్చిన పోలీసులను చంపేసావు అని హీరో అంటే అర్దం ఉండేది. కేవలం పోలీసులు మాత్రమే చనిపోయారని మాట్లాడి, అందుకోసం పగ తీర్చుకునేవాడు హీరో ఎలా అవుతాడు... కేవలం పోలీసులు మాత్రమే చనిపోతే అది వేరే విధంగా ఉండేది. అక్కడ ప్రేక్షకులు ఐడింటెటీ చేసుకునే కార్యకర్తలు కూడా ఉన్నారే... కథరాసుకునేటప్పుడు డైరక్టర్ ఎందుకీ విషయాన్ని మర్చిపోయారో మరి...

రొటీన్ కథ ఎన్నుకున్నప్పుడు...హీరో,విలన్ ని ఎదురెదురు చేసి ఆడుకుంటే సినిమా నిలబడేది. సింగంలా శర్వానంద్ ..విలన్ కు ట్విస్ట్ లు ఇస్తూ రెచ్చిపోతే సినిమా నిలబడిపోయేది. అలా కాకుండా హీరో ఏం చేస్తున్నాడో..విలన్ కు తెలియదు..అఫ్ కోర్స్ ప్రేక్షకుడుకి తెలియదు..ఈ దాగుడు మూత గేమ్ లు..సస్పెన్స్ నిలబెట్టడం కోసం.. యాక్షన్ కోరుకునే స్టోరీ లైన్ లో ఇవి బలవంతంగా యాక్షన్ ని చంపేస్తాయి.

అలాగే ఫస్టాఫ్ ని ఫన్ తో నడిపేస్తున్నామని అనుకున్నారే కానీ, స్క్రీన్ టైమ్ ని కిల్ చేస్తున్నామని అనుకోలేదు. దాంతో ఇంటర్వెల్ దాకా అసలు కథలోకి వెళ్లక..ఫస్టాఫ్ గొప్పగా లేదు..సెకండాఫ్ అదే పరిస్దితి.

కొత్త దర్శకుడు పాత దారి...

కొత్త దర్శకుడు చంద్ర మోహన్..తను తొలి చిత్రాన్ని సేఫ్ జోన్ లో పక్కా కమర్షియల్ గా తీయాలనుకున్నప్పుడు, కొత్త పాయింట్ ని ఎన్నుకోవాల్సింది. అంతేకాని...కమర్షియల్ పేరుతో రొటీన్ పోలీస్ క్యారక్టరైజేషన్ తీసుకుని దానికి కలవని కృష్ణ తత్వం అనే టచప్ ఇచ్చి కొత్తదనం అన్నట్లు భమింపచేయకుండా ఉండాల్సింది. దాంతో అతను దర్శకుడు ఎంతటి సమర్ధుడో కూడా తెలిసే అవకాసం లేకుండా ఫోయింది. కథ,కథనం సరిగ్గా లేకపోవటంతో అతను దర్సకుడుగా ఎంత టాలెంట్ చూపించినా అది బూడిదలో పోసిన పన్నీరే కదా.

శర్వానంద్,లావణ్యా త్రిపాఠి,రవి కిషన్

హీరో శర్వానంద్...ని ఓ రకంగా మనం చూడటానికి అలవాటు పడటం వల్లనేమో..ఇందులో అతను చేసే చేష్టలన్ని ఓవర్ యాక్షన్ గా కనిపించటం మొదలెట్టాయి. అయ్యో ...కాస్త డిఫెరెంట్ ట్రాక్ లో వెళ్తున్న శర్వానంద్ కూడా ఇలా రొటీన్ ట్రాక్ లోకి వచ్చాడే అని బాధకలుగుతుంది. అయితే శర్వానంద్ లో మంచి కామెడీ టైమింగ్ ఉందని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. అదే హీరోగారికి ఈ సినిమా ఓకే చేయటానికి కారణమేమో.

ఇక హీరోయిన్..పాపం...తొలి నాటి నుంచి సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ లా బిహేవ్ చేసే పాత్రలే. ఈ సినిమాలోనూ సేమ్ సిట్యువేషన్ కాకపోతే మరింత ఓవర్.. ఈసారి రాబిట్ అనే ముద్దు పేరుతో..కుందేళ్లతో తిరిగే జీవంలేని పాత్ర. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత దారుణం అంటే సెకండాఫ్ లో అసలు సీన్లే లేవు. వచ్చినా అవన్నీ బలవతంగా వేసినవే. అలా ఈ రాబిట్ దారుణం గా బలైంది.

రవికిషన్...ఈ భోజపురి నటుడు...రేసుగుర్రంలో పాత్రకు ఎక్స్ టెన్షన్ లా కనిపిస్తాడు. హీరోగా తన భాషలో ఓ వెలుగు వెలిగిన ఈయన పేమెంట్ ఎక్కువని తెలుగుకు వచ్చి..ఇలా అర్దం పర్దం లేని పాత్రలు చేస్తున్నాడనిపిస్తుంది.

మిగతా విభాగాలు

సినిమాలో ఉన్నంతలో చెప్పుకోదగినవి శర్వానంద్ పాత్రకు రాసిన డైలాగులు, సినిమాటోగ్రఫీ మాత్రమే. పాటల్లో రెండు తప్ప మిగతావి గొప్పగా లేవు. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్ గా...

బిట్లు బిట్లుగా జెమెనీ కామెడీ ఛానెల్ లో చూపించే ఫన్నీ సీన్స్ లా...విడివిడిగా నవ్వుకోవటానికి బాగుండే సీన్స్ ఉన్న ఈ సినిమా...ఏ విధంగానూ మెప్పించదు. శర్వానంద్ ఉన్నాడు కదా అని ఆశపడితే..తన కామెడీతో మనని వెక్కిరిస్తాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT